బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టు డ్రగ్స్ కేసులో రిమాండ్ పొడిగింపు…

ఈ నెల 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఉత్తర్వులు జారీ చేసిన ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు
బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఆర్యన్…
బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టు డ్రగ్స్ కేసులో రిమాండ్ పొడిగించింది. ఆర్యన్ కు అక్టోబరు 30 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్యన్ ఈ నెల 3న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకంపై సమాచారంతో పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. లేటెస్టుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు..

డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి అనన్య పాండేకి చెందిన ఫోన్, ల్యాప్ టాప్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది..