హీరో ప్రొడ్యూసర్ కలిసుంటే ఏమౌతుంది అనేది మేము చూపిస్తాం… శర్వానంద్,

నిర్మాణ సంస్థలు: ఏ కే ఎంటర్టైన్మేంట్స్
తారాగణం: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, అతిధి పాత్రలో శ్రీ విష్ణు, తదితరులు తదితరులు నటించారు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ విఎస్, యువరాజ్
ఎడిటర్ : రామ్ అబ్బరాజు, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
విడుదల తేది : 14.01.2026
నిడివి : 2 ఘంటల 25 నిముషాలు

ప్రతి సంక్రాంతికి రకరకాల పిండి వంటల మాదిరిగానే.. రకరకాల జానర్లలో సినిమాలు ఉండేవి. కాని ఈ సంక్రాంతికి మాత్రం ఒక్క ‘ది రాజా సాబ్’ మినహా మిగతా నాలుగు సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని గురిపెడుతూ వరుసగా రిలీజ్ అయ్యాయి. మన శంకరవర ప్రసాద్, భర్త మహాశయులకు విజ్ణప్తి, అనగనగా ఒక రాజు, చివరిగా ‘నారి నారి నడుమ మురారి’. ఏ సినిమా అయినా ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ ప్రీమియర్స్ షోలు, బెనిఫిట్ షోలు పడుతుంటాయి. కానీ….ఒకప్పటి మీడియా వారికీ వేసే షోస్ లాగా ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ షో వేసారు. మరి ఈ సంక్రాంతి కి 5వ చిత్రం సినిమా థియేటర్స్‌లో నవ్వులు పూయించేందుకు వచ్చేసింది. సరైన హిట్ లేని శర్వా(Sarwa) ఈ సంక్రాంతి బరిలో ధైర్యం గా బరిలోకి దిగాడు. తనకి కలిసొచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్‌ని చేరువ అవుతూ..వింట్ఏజ్ టైటిల్ తో ‘నారీ నారీ నడుమ మురారి’‌(Nari Nari Naduma Murari)తో ఢీ కొట్టడానికి రెడీ అయ్యాడు. మరి ఈసారి హిట్కొట్టేడు..

హీరో ప్రొడ్యూసర్ కలిసుంటే ఏమౌతుంది అనేది మేము చూపిస్తాం.

నేను ఇప్పుడే మాట ఇస్తున్నాను తర్వాత సినిమాకు నేను రూపాయి కూడా అడగను.

మళ్ళీ మా అనిల్ పెద్ద సినిమా తీసేవరకు నేను రూపాయి కూడా తీసుకోను.

ఎందుకంటే 7 ఏళ్ల నుంచి ఒక హిట్ కోసం కష్టపడుతున్నాం.
దాని విలువ తెలుసు మాకు..

సినిమాతో ఇంత బాగా నవ్వించగలిగే కెపాసిటీ అప్పట్లో జంధ్యాల గారికి, EVV గారికి ఉండేది.
మధ్యలో శ్రీను వైట్ల గారు ఉన్నారు కానీ ఇప్పుడు రాబోతున్న రామ్ అబ్బరాజుకి చెప్పా శ్రీ విష్ణు సినిమా దీనికన్నా 10 రెట్లు అదిరిపోవాలని.

శ్రీ విష్ణు సినిమాల గురించి నేను చెప్పేది ఏం లేదు మీరు ఆల్రెడీ పరిగెడుతున్నారు.
మీ తర్వాత కథ చాలా అదిరిపోయింది అని నేను విన్నా.
కామియో కావాలంటే చేస్తాను.
అనిల్ గారి ప్రొడక్షన్ లో మా ఇద్దరికి ఒక కథ రాయండి ఇద్దరం కలిసి చేస్తాం ఒక స్ట్రెయిట్ సినిమా.

ముందుగా మాకు టైటిల్ ఇచ్చి, ముహూర్తం పెట్టిన బాలయ్య బాబుకి నేను థాంక్స్ చెప్పాలి.. భాను, నందు వాళ్ల కథలు చాలా బాగుంటాయి. మనం అన్ని మర్చిపోయి రెండు గంటల పాటు మంచిగా నవ్వుతాం.
కానీ వాళ్ల సినిమాల్లో క్లైమాక్స్ నాకు నచ్చదు, ఎందుకంటే సినిమా ముగిసిన వెంటనే మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వెళ్తాం కాబట్టి అన్నారు..