ఎన్నికల ప్రదానదికారి శశాంక్ గోయల్…

ఎన్నికల ప్రదానదికారి శశాంక్ గోయల్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాం

ప్రతి పోలింగ్ కేంద్రానికి 5 గురు సిబ్బంది ఉంటారు.

రేపు పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 వరకు పోలింగ్

50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ,మిగతా పోలింగ్ కేంద్రాల్లో సిసి కేమెరా లు ఏర్పాటు.

వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తాం

పోలీసుల ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశాం

పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అందజేశాం.

ఎన్నికల సిబ్బంది ఇచ్చిన వాయిలెట్ కలర్ పెన్ తో మాత్రమే బ్యాలెట్ పత్రం పై టిక్ చేయాలి.

అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెద్ద బ్యాలెట్ పేపర్ తో పాటు జంబో బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటు చేశాం.

కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ ఉంటుంది.

కోవిడ్ పేషేంట్ లకు ,80 సంవత్సరాల వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం ఇచ్చాము.

ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

గతంలో కంటే ఎక్కువగా ఓటు నమోదు చేసుకున్నారు, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.