భారత స్టార్ షట్లర్ వీవీ సింధు జర్మన్ ఓపెన్‌లో ఓటమి

భారత స్టార్ షట్లర్ వీవీ సింధు జర్మన్ ఓపెన్‌లో దారుణ ఓటమి చవిచూసింది. సూపర్ 300 టోర్నీ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు తన కంటే తక్కువ ర్యాంకు క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన జాంగ్ యిమాన్ చేతిలో 14-21 21-15 14-21తో ఓటమి పాలైంది…తొలి సెట్ కోల్పోయిన సింధు రెండో సెట్‌లో పుంజుకున్నప్పటికీ విజయాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ఓటమి పాలైంది. 55 నిమషాల్లో ఈ గేమ్ ముగిసింది. మరోవైపు, ఇదే టోర్నీలో తలపడుతున్న భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, లక్ష్యసేన్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.అయితే, ఆ తర్వాత రెండో రౌండ్‌లో సైనా ఓటమి పాలైంది. థాయిలాండ్‌కు చెందిన 2013 ప్రపంచ చాంపియన్ అయిన రచనోక్ ఇంటానోన్ చేతిలో వరుస గేముల్లో 21-10, 21-15తో ఓటమి పాలైంది. 31 నిమిషాల్లోనే గేమ్ ముగిసింది