ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎస్ సోమేశ్ కుమార్…

ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎస్ సోమేశ్ కుమార్..

కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ…

ఎలాంటి సమయం ఇవ్వని హైకోర్టు..
3 వారాలు సమయం కావాలని సోమేష్‌ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్‌కుమార్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది…

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్‌(కేంద్ర ప‌రిపాల‌న ట్రిబ్యున‌ల్‌)ను ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో కేంద్రం ఉత్త‌ర్వులు నిలిపివేసి తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌తో సోమేశ్ కుమార్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్ర‌యించింది. క్యాట్ మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది కోర్టు. 2019, డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు..