జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్ధాన్ డ్రోన్ కలకలం..

సరిహద్దుల్లో పాకిస్ధాన్ డ్రోన్ కలకలం…

 జమ్మూకశ్మీరులోని అర్నియా సరిహద్దుల్లో అనుమానస్పద పాక్ డ్రోన్‌పై సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కాల్పులు జరిపారు.
గురువారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో డ్రోన్‌ని గమనించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు కాల్పులు జరిపారు. దాంతో వెంటనే డ్రోన్‌ తిరిగి వెళ్లిపోయింది. సైనికులు డ్రోన్‌పై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగినప్పుడు డ్రోన్ 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఎగురుతున్న డ్రోన్ నుంచి మెరిసే కాంతి బీఎస్ఎఫ్ జవాన్లు గమనించారు. పాక్ అనుమానిత డ్రోన్ నుంచి ఏవైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కిందకు జారవిడిచారనే అనుమానంతో బీఎస్ఎఫ్ జవాన్లు వెతుకులాట మొదలు పెట్టింది…