సోష‌ల్ మీడియాకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ…

సోష‌ల్ మీడియాకు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. టెక్ కంపెనీల‌పై ఆధిప‌త్యం కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త డిజిట‌ల్ ముసాయిదాను త‌యారు చేసింది. ఇంటర్నెట్ ఆధారిత‌, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల‌కు కొత్త నియ‌మావ‌ళిని కేంద్రం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన ఇవాళ కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చ‌ర్చించామ‌ని మంత్రి తెలిపారు. డిజిట‌ల్ కాంటెంట్ విష‌యంలో 2018 డిసెంబ‌ర్‌లో ముసాయిదా త‌యారు చేశామ‌ని, దీంట్లో రెండు క్యాట‌గిరీలో ఉంటాయ‌న్నారు. అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ట్వీట్ లేదా సందేశం పోస్టు చేసిన వారి తొలి వ్య‌క్తి స‌మాచారాన్ని కోర్టు ఆదేశం లేదా ప్ర‌భుత్వ ఆదేశం ప్ర‌కారం సోష‌ల్ మీడియా సంస్థ‌లు బ‌హిర్గతం చేయాల‌ని మంత్రి ర‌విశంక‌ర్ తెలిపారు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త‌, భ‌ద్ర‌త‌, శాంతిభ‌ద్ర‌త‌లు, విదేశీ వ్య‌వ‌హారాలు, అత్యాచారం, అస‌భ్య కాంటెంట్‌ను ప్ర‌చారం చేసేవారి విష‌యంలోనే ఈ చ‌ర్య‌లు వ‌ర్తిస్తాయ‌ని మంత్రి వెల్ల‌డించారు