చిట్కాలను క్రమంగా పాటించి షుగర్ ను అదుపు చేసుకో వచ్చు.

*”ఈ చిట్కాలను క్రమంగా పాటించి షుగర్ ను అదుపులో ఉంచుకుందాం” …*

*డియాబెటిస్ (మధుమేహం) అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతుంది. నయం చేయడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి ఉంటుంది.*

*అలా నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు..*

*ప్రతిరోజూ ఒక స్పూన్ దాల్చినచెక్క తినాలి. ఇది రక్తంలోని చక్కెర స్ధాయిని అదుపులో ఉంచుతుంది.*

*ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి, ఉదయం లేవగానే ఆ నీళ్లు తాగి నానిన మెంతులు తింటే అది ఇన్సులిన్ లా పనిచేస్తుదంటారు.*

*ప్రతి రోజూ ఉదయం క్రమం తప్పకుండా విత్తనాలు తీసివేసిన కాకరకాయ రసాన్ని తాగాలి.*

*వెల్లుల్లిని తినాలి, లేదా వెల్లుల్లి కలిగిన మాత్రలు తీసుకుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.*