సింగరేణిలో 327 పోస్టుల భర్తీ…

హైదరాబాద్‌: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. వీటిలో ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌)లో 42, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సిస్టమ్స్‌)లో 07, జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైర్‌ గ్రేడ్‌ సీ – 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ గ్రేడ్‌ సీ – 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ -1లో 47, సింగరేణిలో ఎలక్ట్రిషియన్‌ ట్రైనీ కేటగిరీ – 98 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 4వ తేదీ లోపు http://www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ సూచించింది…..