సిరిసిల్ల సిగలో మరో కలికితురాయి…

సిరిసిల్ల సిగలో మరో కలికితురాయి….
– తొందర్లోనే అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్
– అమాత్యుని సంకల్పంతో ఆహ్లాదకేంద్రంగా అటవీతీరం

సువిశాలమైన అటవీ ప్రాంతం.పక్షుల కిలకిలరాగాలు. నలువైపులా నీటి కుంటలు.
కళ్ల ముందే కదలాడతున్న నెమళ్ళు. ఎటు చుసిన పచ్చదనం. అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్-హరిదాసునగర్ గ్రామాల నడుమ అటవీ ప్రాంతంలో సిరిసిల్ల అర్బన్ పార్క్ రూపుదిద్దుకోబోతుంది.

సిరిసిల్ల పట్టణంతో పాటు జిల్లా ప్రజలు ప్రశాంత అటవీ వాతావరణం లో ఒక రోజంతా గడిపేలా యోగ కేంద్రం, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఉద్యానవనాలు, పిల్లల ఆటస్థలాలు, అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు, అన్ని సౌకర్యాలతో పార్క్ నిర్మాణం జరుగుతుంది…

మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరంలో రూ. కోటి వ్యయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌లోట్రీహౌస్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కాళేశ్వరం ఆలయం, ప్రాజెక్టును వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తారు. పార్కులో వివిధ రకాల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చెట్లపై ట్రీహౌస్‌లను నిర్మించి పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు.

ఎల్లారెడ్డిపేట వెళ్తున్న క్రమంలో అనుకోకుండా పార్క్ ని సందర్శించిన కొందరు, అడవిలోని ప్రకృతి అందాలను ఆస్వాదించాము ఆని చెప్తున్నారు…