సీతక్కకు తప్పిన ప్రమాదం…

నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వాగులో పడవ పై తిరుగు ప్రయాణంలో భాగంగా మధ్యలో పెట్రోల్ అయిపోయి చెట్టుకు ఢీ కొని ఆగిపోయిన పడవ..ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరిగి పడవలో ఏటూరునాగారం వస్తున్న క్రమంలో వాగుదాటుతుండగా ఘటన చోటుచేసుకుంది.మార్గమధ్యంలో బోట్ లో పెట్రోల్ అయిపోగా వాగు ఉద్ధృతికి ఒక ప్రక్కకి పడవ కొట్టుకొనివచ్చి ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోగా అందులోనుండి చెట్టును పట్టుకొని ఒడ్డుకు వచ్చిన సీతక్క..అనంతరం పడవలోంచి ఎమ్మెల్యే సీతక్క బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.నాయకురాలు కాదు సమాజ సేవకురాలు, లీడర్ అనే పదానికి అసలు నిర్వచనం సీతక్క అని కొనియాడుతున్నారు స్థానికులు…