వైకాపాలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు.. శివాజీ.

ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు దారుణమని సినీ నటుడు శివాజీ అన్నారు.రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పండుగ వాతావరణం నెలకొంది…ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికే ఈసారి రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘మూడు రాజధానులంటూ సీఎం జగన్‌ ఎన్నికలకు వెళ్లారు. విశాఖ ఉక్కు, అమరావతి, హోదా ఏమైందని ఆయనను మనం ప్రశ్నించాలి. వైకాపాలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు. ఇప్పుడు పోటీ చేయబోమంటూనే పక్కచూపులు చూస్తున్నారు. ఓటుకు ₹50వేలు ఇచ్చినా వైకాపా ఈసారి గెలిచే పరిస్థితి లేదు’’ అని శివాజీ అన్నారు.