మహా శివరాత్రి సమీపిస్తుండటంతో భక్తులు
ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. శివరాత్రికి ముందు భక్తులు నది స్నానమాచరిస్తారు. శివరాత్రి రోజున ఆ పరమ శివుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆ రాత్రి జాగారం ఉంటారు. జాగారం ఉండటం ద్వారా పునర్జన్మ ఉండదని భక్తులు నమ్ముతారు. శివరాత్రి పూజా క్రతువులో ముఖ్యమైన వాటిల్లో నైవేద్యం ఒకటి. ఆ పరమ శివుడికి శివరాత్రి రోజున ఏ ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నైవేద్యం.. ఆఖరి ఉపచారం..
పూజా విధానంలో నైవేద్యాన్ని ఐదో ఉపచారం లేదా ఆఖరి ఉపచారంగా చెబుతారు. నైవేద్యమంటే.. ‘ఈశ్వరా తినండి..’ అంటూ పరమ ప్రీతితో పదార్థాన్ని దేవుడికి సమర్పించడం. రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఉచ్చిష్టములను శివుడికి నైవేద్యంగా ఇవ్వరాదు. ఉచ్చిష్టములు అనగా.. ఇతరులు తినగా మిగిలినది. లేదా వండిన దానిలో అంతా తినగా మిగిలినది. నైవేద్యాన్ని ప్రత్యేకంగా వండి మొదట ఆ ఈశ్వరుడికి సమర్పించాలి. అంతే తప్ప.. బయట కొని తీసుకొచ్చిన పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలు నైవేద్యంగా పెట్టరాదు. ఏం పెట్టావు… ఎంత పెట్టావన్న దాని కన్నా.. ఎంత భక్తితో, ప్రేమతో నైవేద్యాన్ని సమర్పించావన్నదే ముఖ్యమని పండితులు చెబుతుంటారు. ఆహార పదార్థాల్లో ఒక్క బెల్లం ముక్కకే నిల్వ దోషం లేదని.. కాబట్టి బెల్లంతో కూడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తే పరమ శివుడు సంతోషిస్తాడని చెబుతారు. సాత్విక పదార్థాలే శివుడికి నైవేద్యంగా పెట్టాలంటారు. ఈశ్వర నైవేద్యాన్ని ప్రసాదంగా కళ్లకు అద్దుకుని తినాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈశ్వరుడి అనుగ్రహం పొందుతారు. భగవత్ ప్రసాదాన్ని ఆరో వంతు మనసుగా చెబుతారు. ఏం పెట్టావు… ఎంత పెట్టావన్న దాని కన్నా.. ఎంత భక్తితో, ప్రేమతో నైవేద్యాన్ని సమర్పించావన్నదే ముఖ్యమని పండితులు చెబుతుంటారు. ఆహార పదార్థాల్లో ఒక్క బెల్లం ముక్కకే నిల్వ దోషం లేదని.. కాబట్టి బెల్లంతో కూడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తే పరమ శివుడు సంతోషిస్తాడని చెబుతారు. సాత్విక పదార్థాలే శివుడికి నైవేద్యంగా పెట్టాలంటారు. ఈశ్వర నైవేద్యాన్ని ప్రసాదంగా కళ్లకు అద్దుకుని తినాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈశ్వరుడి అనుగ్రహం పొందుతారు. భగవత్ ప్రసాదాన్ని ఆరో వంతు మనసుగా చెబుతారు.
పక్వాలు.. అపక్వాలు.. :
నైవేద్యానికి సంబంధించి రెండు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఒకటి పక్వం, రెండు అపక్వం. పక్వం అనగా వండినది.. అపక్వం అనగా వండనది. అపక్వాల్లో కొబ్బరికాయ శివుడికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. శివలింగం ముందు కొబ్బరికాయ కొట్టి.. ఆ నీటిని లింగంపై ధారగా పోయాలి. కొబ్బరి ముక్కలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, కర్జూరాలు శివుడికి ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు. ఇక పక్వానికి సంబంధించి పాయసం శివుడికి ఇష్టమైనదిగా చెబుతారు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం ద్వారా సకల సుఖ, సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.