డిష్యుo.. డిష్యుo….చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానలాగా మారి కొట్లాట అయ్యంది…

డిష్యుo.. డిష్యుo..
……..
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల మధ్య జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానలాగా మారి కొట్లాట అయ్యంది….వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాలు నిన్న యాదాద్రి దర్శనం కోసం వచ్చాయి.. కొండ కింద పుష్కరిణి వద్ద బస్సు ఎక్కి, కొండ మీదకు వెళ్లేందుకు దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ఎక్కారు… బస్సు ఎక్కే సమయంలో ఓ మహిళ కాలికి మరొక మహిళ కాలు తగిలింది…. అంతే ఆ చిన్న వివాదంతో కొండ పైకి పోయేంత వరకు ఇరువురు వాదులాడు కున్నారు…..మాట మాట పెరిగి కొండ పైన బస్సు దిగగానే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.. పిడి గుద్దులు గుద్దుకున్నారు… వెంటనే అక్కడున్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు సర్దుచెప్పి పంపించారు….