ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్‌ ద్వీపంపై రష్యా మిలిటరీ దాడి…13 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణం…..

రష్యా సరిహద్దుల్లోని నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్‌ ద్వీపం ఉన్నది. అక్కడ రక్షణగా తన బలగాలను మోహరించింది. గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభించింది.
ఆ సమయంలో స్నేక్‌ ద్వీపంలో 13 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్నారు.సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న రష్యన్‌ నేవీకి చెందిన వార్‌షిప్‌ అక్కడికి వచ్చింది. దీంతో ఉక్రెయిన్‌ సైనికులను గుర్తించిన వార్‌ షిప్‌ సిబ్బంది వారిని లొంగి పోవాలని సూచించారు. లేదంటే కాల్చేస్తామని హెచ్చరించారు. దానికి ఆ సైనికులు తిరస్కరించడంతో వార్‌ షిప్‌ నుంచి గుండ్ల వర్షం కురిసింది. దీంతో 13 మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించారు…