పాము కాటుకు ఆడ సింహం బలి..!!!

పాము కాటుకు ఆడ సింహం బలైంది. ఒడిశా భువనేశ్వర్​లోని నందన్​కనన్​ జూ పార్క్​లో శనివారం ఈ ఘటన జరిగింది. ఓ ఎన్​క్లోజర్​లో ఉన్న ఆడసింహం గంగను.. శుక్రవారం కోబ్రా జాతికి చెందిన ఓ విషసర్పం కాటేసినట్లు అధికారులు తెలిపారు. సింహానికి సమీపంలోని ఓ వాటర్​ ట్యాంక్​ వద్ద విషపూరిత పాము ముడుచుకొని ఉందని, అదే కాటేసి ఉంటుందని భావిస్తున్నారు…చికిత్స చేస్తుండగా ఆడసింహం చనిపోయిందని జూ సిబ్బంది వెల్లడించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ప్రాణాలు దక్కలేదని పేర్కొన్నారు. సింహం మరణానికి అసలు కారణం పోస్టుమార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు…