భూమిలోనుంచి బయటకు వస్తున్న పాములు…..

భూమిలోనుంచి బయటకు వస్తున్న పాములు

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20కి పైగా పాము పిల్లలు భూమిలోంచి బయటకు వచ్చాయి. అది కూడా నిత్యం ప్రజలు తిరిగే రోడ్డు పక్కన. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వెంకటాపురంలో రోడ్డుపక్కన మిషన్ భగీరథ కోసం గొయ్యి తీసి పూడ్చివేశారు. అందులోనే పాము గుడ్లను పెట్టింది. మొదట ఈ గొయ్యి నుంచి పాము పిల్ల బయటకు వచ్చింది. స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఒకదాని వెనుక ఒకటి ఇలా 20కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. అయితే ఈ పాము పిల్లలను చంపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిసరాల్లోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత గొయ్యిని తవ్విన స్థానికులకు అందులో మరిన్ని పాము గుడ్లు కనిపించాయి. వాటిని ధ్వంసం చేసి గొయ్యిని పూడ్చివేశారు. అయితే తప్పించుకున్న పాములు ఇళ్లల్లోకి వచ్చి కాటేస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.