స్నేహ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం..

*స్నేహ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం..

జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్నేహ షాపింగ్ మాల్ లో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇవాళ తెల్లవారుజామున 3:30 సమయంలో మంటలు వ్యాపించాయని స్థానికలు పేర్కొంటున్నారు….ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపింగ్ మాల్ లోని బట్టలు, ఫర్మీచర్ పూర్తిగా ధ్వంసం అయింది.
ప్రమాదంలో సుమారుగా రూ. కోటి 50 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పాతపట్నం పోలీస్ సిబ్బంది, స్థానికుల సహాయంతో అటు ఒడిస్సా ఇటు టెక్కలి అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు…