తెలంగాణలోకి BOSCH సంస్థ..3 వేల మందికి జాబ్స్.. మంత్రి కేటీఆర్ ప్రకటన..

R9TELUGUNEWS.news
తెలంగాణలోకి BOSCH సంస్థ.. 3 వేల మందికి జాబ్స్.. మంత్రి కేటీఆర్ ప్రకటన
తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు మరో మల్టీ నేషనల్ కంపెనీ(MNC) ముందుకు వచ్చింది. తద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనేక ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ BOSCH హైదరాబాద్ లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్ వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో హైదరాబాద్ (Hyderabad) లో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కే తారకరామారావు (Minister KTR) BOSCH కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మౌలిక వసతులతో పాటు మానవ వనరులు ఉన్నాయని కేటీఆర్ వారికి వివరించారు. కంపెనీ ప్రస్తుతం నిర్దేశించుకున్న మూడు వేల మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే దాటి మరింత విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని మంత్రి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన అనేక కంపెనీలు అత్యంత వేగంగా విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.