సోనియా గాంధీ కి కరోనా…!

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఆమె ఐసోలేష‌న్‌లో చిక్సిత పొందుతున్నార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ట్విట‌ర్‌లో వివ‌రాలు తెలిపారు. ‘‘నిన్న (బుధవారం) సాయంత్రం సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం వచ్చిందని, ఇత‌ర క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధప‌డ్డారు. ఆ తర్వాత ఆమెను పరీక్షించినప్పుడు ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. ఆమె ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు’’ అని చెప్పారు. సోనియా గాంధీ గత వారంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలను కలిశారని, దాని వల్లే తనకు ఇన్ఫెక్షన్ సోకిందని సూర్జేవాలా చెప్పారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఆందోళ‌న చెందుతున్నారు….ఈ క్ర‌మంలో సోనియా గాంధీ ప్ర‌స్తుతానికి ఆరోగ్యం బాగానే ఉంద‌నీ, ఆమె త్వ‌ర‌గానే కోలుకుంటున్నారు. ప్ర‌క‌టించిన దాని ప్ర‌కార‌మే సోనియా గాంధీ ఈ నెల 8న ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారు. సోనియా గాంధీ ఆరోగ్యంపై మేము వివ‌రాలు అందిస్తూ ఉంటామ‌నీ, ఆమెను గ‌త వారం రోజులుగా క‌లిసిన నేతలందరినీ క‌రోనా ప‌రీక్ష చేయించికోవాల్సిన విజ్ఞప్తి చేశారు. కాగా, నేష‌నల్ హెరాల్డ్ దిన‌ప‌త్రికకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. జూన్ 8న సోనియాను ఈడీ ప్రశ్నించనుండగా, రాహుల్‌ను గురువారం హాజరుకావాలని కోరింది.