కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మరోసారి కరోనా..!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జైరాం రమేష్‌ తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు సోనియాగాంధీ. జూన్‌ 2న ఆమె వైరస్‌ బారిన పడ్డారు.