ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ…

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆమె దిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 2న సోనియాగాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే…అధినేత్రి సోనియా గాంధీ కొవిడ్‌ సంబంధిత సమస్యల కారణంగా దిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె గురించి ప్రార్థిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జూన్‌ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు పంపించింది. కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు కోరడంతో ఆమెను ఈ నెల 23న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలని ఈడీ తాజాగా సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే..