కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత పీపీ మాధవన్‌పై రేప్ కేసు నమోదు…!!!

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌పై రేప్​ కేసు నమోదైంది. 26 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు...

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్‌పై రేప్ కేసు నమోదైంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్‌లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.జూన్ 25న పోలీసులకు అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పీపీ మాధవన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పర్సనల్ సెక్రెటరీగా పని చేస్తున్నట్టు సమాచారం…ఈ కేసుపై సోనియా గాంధీ పీఏ మాధవన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధారమైన కేసులు అని, ఇది తనపై పన్నిన కుట్ర అని కొట్టిపారేశారు.