తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నా సోనియా గాంధీ ..!

*కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.* రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె జైపుర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. *సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ* , ఇతర నేతలు ఉన్నారు. సోనియా గాంధీతో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల కాంగ్రెస్ విడుదల చేసింది. అందులో రాజస్థాన్‌ నుంచి మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్,అభిషేక్ మను సింఘ్వి, చంద్రకాంత్ హండేరే పేర్లను ప్రకటించింది.