సోనూసూద్ చెల్లెలు మాళవిక ఓటమి..

పంజాబ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి ఘోర పరాబావం ఎదురవుతోంది. కాంగ్రెస్‌ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. తాజాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన నటుడు సోనూసూద్ చెల్లెలు మాళవిక సూద్‌ ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో ఓటమి చెందారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మోగ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. 1977 నుంచి 2017 వరకూ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఆరుసార్లు నెగ్గింది…

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో పంజాబ్ ఫలితాలు హేమాహేమీలకు షాకిచ్చాయి. అధికార కాంగ్రెస్, స్థానికంగా ప్రజాదరణ ఉన్న శిరోమణి అకాళీదళ్, కమలం పార్టీకి షాక్ ఇచ్చింది చీపురు పార్టీ. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తుంది. పంజాబ్ హస్తం పార్టీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ముఖ్యమంత్రి చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు తలెత్తిన చివరి క్షణంలో వారు పక్కన పెట్టి బరిలో నిలిచారు. ఇద్దరు నేతలు ఐక్యమత్యంగా ఉన్న సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ (Congress) అంతర్గత రాజకీయాలతో విసిగిపోయిన పంజాబ్ ప్రజలు అప్‌కే పట్టం కట్టారు. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ఆమ్‌ఆద్మీ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. .