ఇస్లాం దేశాలంటే మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తాయి. వారి హక్కులను కాలరాస్తున్నాయి. మహిళ సింగ్ల్గా బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తున్నాయి. షరియా చట్టం పేరుతో అరాచకాలను సృష్టిస్తున్నాయి. మహిళలు చదువుకోవద్దంటూ తాలిబన్లు చెబుతున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సులు యువతులు చదవడం సంస్కృతికి విరుద్ధమంటున్నారు. హిజాబ్ ధరించకపోతే శిక్ష తప్పదంటూ ఇరాన్ హూంకరిస్తోంది. అదే సమయంలో ఓ ఇస్లామిక్ కంట్రీ మాత్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. బుర్కా ధరించడం యువతు ఇష్టమంటూ ప్రకటించింది. దీంతో అక్కడి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ దేశం ఏది? ఎందుకు బుర్కాను ఐచ్చికమని ఎందుకు తేల్చింది?.ఇస్లాం దేశాల్లో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. అఫ్ఘానిస్థాన్, ఇరాన్ వంటి దేశాల్లో మహిళపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మహిళలు కనీసం ఒంటరిగా వెళ్లేందుకు కూడా స్వాతంత్రం లేకుండా పోయింది. అఫ్ఘానిస్థాన్‌లో మహిళ పొరబాటున బయటకు వస్తే కొరడా దెబ్బలు తప్పవు. ఒకవేళ బుర్కా, హిజాబ్ ధరించకపోతే రాళ్ల దెబ్బలు తప్పవు. బాలికా విద్యను నిషేధించారు. తాజాగా యూనివర్సిటీల్లో మహిళలు చదువుకోరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు విధించారనే కారణం తెలిస్తే అవాక్కవుతారు. యూనివర్శిటీ విద్యార్థునులు సరైన డ్రస్ కోడ్‌తో సహా నిబంధనలు పాటించడం లేదట. పైగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌తో పాటు వృత్తివిద్యాకోర్సులు ముస్లిం గౌరవ మర్యాదలకు, అఫ్ఘానిస్థాన్ సంస్కృతి సరిపోవట. బాలికలకు మాత్రమే విద్యనందించే మదర్సాలను కూడా మూసివేయాలని తాలిబన్లు నిర్ణయించారట. పోనీలే అని దయతలచి మసీదుల్లో నిర్వమించేందుకు అనుమతించినట్టు తాజాగా తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. తాజా తాలిబన్ల నిర్ణయంపై ఇస్లాం దేశాలే మండిపడుతున్నాయి. ఇది ఇస్లాంకు వ్యతిరేకమని మానవత్వంపై దాడిగా ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి. కానీ తాలిబన్లు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. మహిళలు, బాలికలపై తాలిబన్లు చిత్ర విచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. సాధారణ జీవనంతో పాటు చదువు, ఉద్యోగాల వరకు అన్ని విషయాల్లోనూ మహిళల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారు..అఫ్ఘానిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఇరాన్‌లోనూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కాకపోతే కాబుల్ కంటే టెహ్రాన్‌లో పరిస్థితులు కొంచెం బెటర్‌గా ఉన్నాయి. కానీ షరియా చట్టాన్ని మాత్రం అమలుచేస్తోంది. మహిళలు తప్పనిసరి డ్రస్కోడ్ పాటించాల్సిందే. దుస్తుల ధారణ విషయంలో ఇరాన్ ప్రత్యేకంగా మొరాలిటీ పోలీసులను నియమించింది. అయితే మహ్సా ఆమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని సెప్టెంబరు 16న మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి కస్టడీలోనే చనిపోయింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీగా మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. మూడు నెలలైనా ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు. మొదట రాజధాని టెహ్రాన్‌కే పరిమితమైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. హిజాబ్‌ను తగులబెడుతున్నారు. పలువురు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. హిజాబ్‌తో పాటు మొరాలిటీ పోలీసు వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రజలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే మొరాలిటీ పోలీసుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ హిజాబ్ విషయంలో మాత్రం ససేమిరా అంది. ఆందోళనలపై ఉక్కుపాదం మోపింది. పలు చోట్ల బాంబు దాడులు, కాల్పులు జరిపించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు వేలాది మంది ఆందోళనకారులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు వరకు ఇద్దరు ఆందోళనకారులను ప్రభుత్వం ఉరేసింది. ఆందోళనల్లో పాల్గొన్న 18వేల మందిని అరెస్టు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 60వేల మందికి పైగా అరెస్టు చేసి ఉంటారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ రెండు దేశాలే కాదు ఇతర ఇస్లాం దేశాలు కూడా మహిళల హక్కులను హరించి వేస్తున్నాయి..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.