మేడారం జాతరలో ఎస్సైని చెంప పై కొట్టిన ఎస్పీ.!!?

*మేడారం జాతరలో ఎస్సైని చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.!!?

#కుటుంబసభ్యుల ముందే కింద కూర్చోబెట్టి పనిష్మెంట్
#మేడారం జాతరలో ఘటన

వరంగల్ (మేడారం), ఫిబ్రవరి 23: మేడారం జాతరలో తన కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క దర్శనానికి వెళ్తున్న ఏఆర్ ఎస్సై రవికుమార్ ను అతని ఫ్యామిలీ మెంబర్స్ ముందే ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌష్ చెంప దెబ్బ కొట్టారు. శుక్ర వారం రాత్రి ఈ ఘటన జరిగింది. వరంగల్ కమిషనరేట్ కు చెందిన రవికుమార్ ప్రస్తుతం మేడారం జాతరలో రోప్ పార్టీ ఇన్చార్జ్ డ్యూటీలో ఉన్నారు. శుక్ర వారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లారు. క్యూ లైన్ లోకి తన భార్య, పిల్లలను పం పించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఆలం గౌష్ రవికుమార్ చెంప మీద కొట్టా రు. ఈ హఠాత్పరిణామంతో ఎస్సై బిత్తర పోగా, ఎస్పీ బూతుపురాణం అందుకు న్నారు. ఇది చూసిన ఎస్సై కుటుంబ సభ్యు లు కన్నీటి పర్యంతమ య్యారు. పనిష్మెం ట్ కింద కుటుంబ సభ్యుల ముందే రవి కుమార్ను కింద కూర్చోబెట్టారు. కొందరు సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయ గా, ఉన్నతాధికారులు శాంతింపజేశారు.