భూవివాద ఘర్షణలో వ్యక్తి మరణించడం బాధాకరం.. ఎస్పీ రాజేందర్ ప్రసాద్..

సూర్యాపేట జిల్లా.
చింతలపాలెం మండలంలో గత రెండు రోజుల క్రితం రాణరంగాన్ని తలపించిన భూవివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది….

చింతలపాలెం గ్రామంలో వ్యవసాయ భూమి గెట్టు తగాదా లో ఇరు కుటుంబాల దాడిలో గాయపడి మరణించిన వాచ్య కుటుంబ సభ్యులను, గాయపడ్డ వృద్దుడు హస్సెన్ ను పరామర్శించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. కేసును పారదర్శకంగా దర్యాప్తు జరిపి దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులను అదుపులోకి తీసుకుంటాం అని ఎస్పీ బాధితులకు తెలిపినారు.

ఈ సంఘటనలో మొత్తం 17 మందిని గుర్తించాం అందరినీ అదుపులోకి తీసుకుంటాము. ఈ ఘటనకు సంభందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన SI ని జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేయడం జరినది, పోలీసు వైఫల్యం పై శాఖాపరమైన చర్యలు కచ్చితంగా తీసుకుంటాము. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేసినాము, ఇతరులు ఎవ్వరైనా గ్రామంలో అలజడి లేపినా, కక్ష్య పూరితంగా ప్రేరేపించిన అలాంటి వారిపై కూడా చర్యలు ఉంటాయి అని ఎస్పీ అన్నారు.

భూమి తగాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి, దాడులు చేసుకుంటే కుటుంబాలు నష్టపోతాయి, కక్షలు పెరిగి మానవ సంభంధాలు తెగిపోతాయి, సామరస్య దొరనితో పరిష్కరించుకోవాలి అని ఎస్పీ అన్నారు.

ఎస్పీ వెంట DSP ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, హుజూర్ణగర్ CI రామలింగ రెడ్డి, స్థానిక SI, ఇతర SI లు సిబ్బంది ఉన్నారు.