ఎస్పీ భార్యకే టోకరా వేశాడు..వీడు మాములోడు కాదు..!!

మోసగాళ్లు, దొంగలు ఎవర్నైనా బురిడీ కొట్టించగలరు. ఆ తర్వాత దొరికిపోయినా చేయాల్సింది మాత్రం పక్కాగా చేసేస్తారు. అలాంటి ఓ దొంగ ఏకంగా ఎస్పీ భార్యకే టోకరా వేశాడు. వాలెట్ పార్కింగ్ పేరుతో ఎంచక్కా పనికానిచ్చి అందరికీ షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే. మే 25న గుంటూరులోని కొమ్మినేని గార్డెన్స్ లో ఓ ఫంక్షన్ జరుగుతోంది. పెద్దోళ్ల ఇంట్లో ఫంక్షన్ కావడంతో చాలా మంది ప్రముఖులు వచ్చారు. దీంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఇంలో ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలోని అసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ సతీమణి సంధ్య కూడా అక్కడికి వచ్చారు. ఫంక్షన్ హాల్ ఎదుట కారుదిగి లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఓ యువకుడు వచ్చి మేడమ్ కార్ పార్కింగ్ ఇక్కడ కాదని.. వేరే చోట ఉందని చెప్పాడు. ఐతే ఆమె కూడా వాలెట్ పార్కింగ్ అనుకొని సదరు యువకుడికి తాళాలు ఇచ్చారు. కాసేపటికి డౌట్ వచ్చి వెళ్లి కారు చూడాల్సిందిగా సంధ్య ఆమె తండ్రికి చెప్పారు. ఆయన వెళ్లగా అక్కడ కారుంది. సదరు యువకుడు కారు తాళాలు కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కారులో పర్సు మర్చిపోయిన సంగతి గుర్తొచ్చి మరోసారి వెళ్లి చూడగా అందులో పర్సు ఉంది. కానీ పర్సులోని బంగారం, నగదు కనిపించలేదు. దీంతో కారంతా వెతికినా ఎక్కడా నగలు కనిపించలేదు. దీంతో వాలెట్ పార్కింగ్ అంటూ వచ్చిన యువకుడే దొంగతనం చేశాడని భావించి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు పాతనేరస్తులను ఆరా తీయగా అతడ్ని బాలరాజుగా గుర్తించాడు. బాలరాజు గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి నగలు, నగదు బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. దొంగతనం చేసేటప్పుడు బాలరాజు చాలా తెలివిగా వ్యవహరించాడు. ఎలాంటి డౌట్ రాకుండా ఉండేందుకు ముందుగానే కార్ వెనుక డోర్ గ్లాస్ కొంచెం దించి కారును పార్క్ చేసి తాళ్లాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఎవరూ లేని టైమ్ లో కారులోని పర్సు తీసుకొని అందులో నగలు, నగదు తీసుకొని పర్సును కారులో పెట్టేశాడు. ఐతే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చేసిన దొంగతనం ఒప్పుకున్నాడు. పెద్ద పెద్ద వాళ్ల పెళ్లిళ్లు, ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఇలాంటి వాళ్లు రెడీగా ఉంటారని అలాంటి సందర్భాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు…!