అంతరిక్షంలో పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్…!

అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు కుదుపు. స్పేస్‌ఎక్స్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ విఫలమైంది..టెక్సాస్‌లోని బొకా చికా వేదిక నుంచి గురువారం సాయంత్రం 4.37గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. అయితే రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాక మధ్యలోనే దానిపై భాగం సాంకేతిక కారణాలతో పేలిపోయింది. దీంతో శకలాలు కరేబియన్‌ సముద్రంలో పడ్డాయి. కిందిభాగం బూస్టర్‌ క్షేమంగా భూమిపైకి చేరింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

రాకెట్‌ పేలిపోవడంపై స్పేస్‌ఎక్స్‌ స్పందించింది. ప్రయోగానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం సేకరించినట్లు పేర్కొంది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్‌ విశ్వసనీయతను పెంచిందని తెలిపింది. 232 అడుగుల భారీ రాకెట్‌ అయిన దీనిలో మొత్తం 33 రాప్టార్‌ ఇంజిన్లు వాడారు..