శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే దారిలో స్పీడ్ గన్స్…. వాహనం దారులరా జరభద్రం. అతివేగానికి తప్పదు భారీ పెనాల్టీ…

*శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే దారిలో స్పీడ్ గన్స్…

*శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పోతున్నారా… అయితే వాహన వేగం విషయంలో జాగ్రత్త సుమా……

వేగంగా వెళితే జరిమానా పడుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే ప్రధాన దారిలో వేగంగా వెళ్లే వాహనాలకు కళ్లెం వేయడానికి అధికారులు స్పీడ్ గన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఇక నుంచి ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారి పైన 60కిమీ కన్నా ఎక్కువ స్పీడ్ గా వెళ్లారంటే ఫైన్ పడుతుంది.

బెంగుళూరు జాతీయ రహదారిని అనుకుని ఉండడంతో పాటు హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండడంవల్ల ఎయిర్ పోర్ట్ రోడ్ చాలా రద్దీగా ఉంటుంది. దీంతో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లకుండా స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ లు వాహనాల మితిమీరిన వేగాన్ని ఈ మేరకు తగ్గిస్తాయనేది వేచి చూడాల్సిందే. కాగా స్పీడ్ గన్ లు ప్రస్తుతం ట్రయల్ రన్ కోసం ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

స్పీడ్ గన్ లను నాలుగైదు రోజులు పరిశీలించిన తర్వాత వేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు