ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు…

22-02-2022.. ఏముంది? అన్నీ రెండు అంకెలు ఉన్నాయి.. ఈరోజు తెల్లవారుజామునో, మధ్యాహ్నమో 2 గంటల 22 నిమిషాల 22 సెకన్లు కూడా మళ్లీ మళ్లీ రానిదేలే.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది అంతకంటే కొంచెం స్పెషల్…
22 ఫిబ్ర‌వ‌రి 2022 తేదీ గురించి ఇప్ప‌టికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు తేదీ పాలిండ్రోమ్, అంబిగ్రామ్. అలాగే. దాన్ని ubiquitous palindrome date డేట్ అని కూడా పిలుస్తారు. అంటే.. ఈరోజు తేదీలో 22-2-22 ఫార్మాట్‌లో రాసిన‌ప్పుడు 2 త‌ప్పించి ఇంకో అంకె ఉండ‌దు. అలాగే.. 22-02-2022 ఫార్మాట్‌లో రాసిన‌ప్పుడు అది పాలిండ్రోమ్, అంబిగ్రామ్ అవుతుంది. ఈరోజుకు అంత చ‌రిత్ర ఉంద‌న్న‌మాట‌.

ఇలాంటి రోజులు చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంటాయి. ubiquitous palindrome date మాత్రం మళ్లీ 11 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇలాంటి రోజు ప్రతి 11 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మళ్లీ మార్చి 3, 2033న ఆ తేదీ వస్తుంది. దాన్నే 3-3-33 ఫార్మాట్లో రాస్తే అందులో 3 అనే నెంబర్ తప్పించి మరో నెంబర్ ఉండదు. అలాగే.. ఏప్రిల్ 4, 2044..4-4-44 ఫార్మాట్లో రాస్తే.. అది కూడా
2033 తర్వాత మరో 11 ఏళ్లకు రానుంది.

ఫిబ్రవరి 22,2022 ను 8 డిజిట్ల పాలిండ్రోమ్ డేట్ అని అంటున్నారు. మళ్లీ అటువంటి పాలిండ్రామ్.. ఫిబ్రవరి 22, 2222న రానుంది. అంటే.. మరో 200 ఏళ్ల తర్వాత 22-2 2222న ఏడు డిజిట్ల పాలిండ్రోమ్ డేట్ రానుంది…

డెలివరీ లు పెరిగేయి…!!!!
అన్నికన్నా ముఖ్యంగా తొమ్మిది నెలలు నిండిన గర్భవతులు.. ఇలాంటి అరుదైన తేదీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఏ తల్లిదండ్రి అయినా తమ బిడ్డ ప్రత్యేకమైన రోజున జన్మించాలని కోరుకుంటున్నారు. అలా అయితే ఆ రోజు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది….తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచమంతటా భారీగా డెలివెరీలకు ప్లాన్లు చేసుకున్నట్లు సమాచారం.. 22022022 రోజున తమ బిడ్డ పుడితే.. జీవితాంతం ఈ జీగా గుర్తు ఉంటుందని.. అంతేకాదు తమ బిడ్డ చాలా ప్రత్యేకమైన రోజున పుట్టాడని అందరికీ చెప్పుకుని తల్లిదండ్రులు ఆనందంగా ఫీలవుతూ ఉంటారు.