వీరి బరువుకి ప్రత్యేక విమానం ఏర్పాటు..!

సాధారణంగా విమానాలు తన సామర్థ్యానికి సరిపడే బరువుతో మాత్రమే ఎగరగలవు. ఒక వేళ బరువు ఎక్కువైతే టేకాఫ్ సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో బరువు కారణంగా విమానాలు కుప్పకూలిన సంఘటనలు కూడా ఉన్నాయి.బరువు ఎక్కువైతే ప్రయాణికుల లగేజీని తగ్గించడమో, లేకపోతే వేరే సర్దుబాట్లు చేయటమో జరుగుతుంది.

ఇదిలా ఉంటే బరువు ధాటికి ఏకంగా జపాన్ ఎయిర్‌లైన్స్ ఏకంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అసలు అంత బరువు ఎలా వచ్చిందని అనునకుంటున్నారా..? సమో రెజర్లే అందుకు కారణంగా. జపాన్ మల్లయోధులు సుమో రెజ్లర్ల గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. భారీ కాయం కలిగిన వీళ్లు ప్రపంచంలోనే ఎక్కువ బరువు ఉండే రెజ్లర్లుగా ముద్రపడ్డారు. అయితే వీరి బరువు ధాటికి విమానం టెకాప్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది.

జపాన్ రాజధాని టోక్యో , ఒసాకా నుంచి అమామి ద్వీపంలో జరిగే ఓ జాతీయ క్రీడా టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లేందుకు విమానం ఎక్కిన సుమో రెజ్లర్ల బరువు కారణంగా విమానం టేకాఫ్ కావడానికి ఇబ్బంది కావచ్చని తేలడంతో చేసేదేం లేక మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఒక్కో రెజ్లర్ బరువు 120 కిలోలు ఉండటంతో వేరే విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సీఎన్ఎన్ తెలిపింది. మొత్తం 27 మంది అథెట్లలో రెండు గ్రూపులు అక్టోబర్ 12న ప్రత్యేక విమనాల్లో బయలుదేరాల్సి ఉంది. ఒకటి టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టు నుంచి, రెండోడి ఒసాకలోని ఇటామి ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలి. అయితే రెండోడి చిన్న డొమెస్టిక్ విమానాశ్రయం. అయితే రెజ్లర్ల బరువు దాదాపుగా 120 కిలోలు ఉండటంతో పాటు రెండు బోయింగ్ 737-800 విమానాలు ఒక్కోక్కటి 165 మంది ప్రయాణికులతో పాటు బరువుకు తగ్గట్లుగా ఇంధనాన్ని మోసుకెళ్లలేవని విమానయాన సంస్థ ఆందోళన చెందింది.

సాధారణంగా విమాన ప్రయాణికుల సగటు బరువు 70 కిలోలుగా లెక్కిస్తారు. దీనికితోడు పెద్ద విమానాలు అమామి ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడానికి, టేకాఫ్ కావడానికి సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 14 మంది ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీంతో కొంతమంది ప్రయాణికులు ముందుగా ఒసాకా నుంచి టోక్యో వెళ్లాల్సి వచ్చింది. విమాన బరువు పరిమితుల కారణంగా ప్రత్యేకంగా మరో విమానాన్ని నడపడం అసాధారణమైందని మరో విమానాన్ని నడపడం అసాధారణమైందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు..