సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ విజయం…

స్కోర్ బోర్డ్..

ఇంగ్లండ్‌: 20 ఓవర్లలో 166/4 (మొయిన్‌ 51 నాటౌట్‌, మలాన్‌ 41, సౌథీ 1/24).

న్యూజిలాండ్‌: 19 ఓవర్లలో 167/5 (మిచెల్‌ 72 నాటౌట్‌, కాన్వే 46, లివింగ్‌స్టోన్‌ 2/22)
R9TELUGUNEWS.COM.
, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ విజయం సాధించింది. T20 ఫార్మాట్లో తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది…. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిన న్యూజిలాండ్‌ తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. తద్వారా 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి ఎదుర్కొన్న న్యూజిలాండ్‌ తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది…కివీస్‌ ఓపెనర్‌ డారెల్‌ మిచెల్‌ (72 పరుగులు, 47 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో నీషమ్‌(11 బంతుల్లో 27 పరుగులు) 3 సిక్సర్లతో హోరెత్తించి న్యూజిలాండ్‌ విజయానికి బాటలు పరిచాడు…