హైదరాబాద్ లో పరుగుల వర్షం కురిపించిన సన్ రైజర్స్…

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన SRH బ్యాటర్లు మొదటి నుంచి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్దారు..

సొంత స్టేడియమైన ఉప్ప‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌కు చిత‌క్కొట్టారు. నువ్వానేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతూ సిక్స‌ర్లు, బౌండ‌రీల‌తో

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు వీరంగం సృష్టించారు. ఫలితంగా ఆరెంజ్‌ ఆర్మీ 31 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్‌ చరిత్రలోనే అ‍త్యధిక టీమ్‌ స్కోర్‌ నమోదు చేసింది…

ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన రికార్డు క్రియట్ చేసింది. ఇంతకాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉన్న అత్యధిక పరుగుల(263) రికార్డును బద్దలు కొట్టింది. ఏకంగా 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే చెదిరిపోని రికార్డు సృష్టించింది…

హోరెత్తించారు. అరం గేట్రంలోనే ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (62) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టి హైద‌రాబ్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు..

అత‌డి త‌ర్వాత‌ అభిషేక్ శ‌ర్మ‌(63) విధ్వంసం కొన‌సాగించాడు. ఆ తర్వాత క్లాసెన్ (80) వీర బాదుడు బాదాడు. మార్కరామ్ (42) కూడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

దీంతో సన్ రైజ్ హైదరాబాద్ జట్టు స్కోరు నిర్ణిత 20 ఓవర్లకు 277 భారీగా స్కోరు నమోదు చేసింది. దీంతో ముంబైకి 278 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది..