శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది…338కు చేరిన లీటర్ పెట్రోల్ ధర…

శ్రీలంక…..

ప్రజల జీవనం దయనీయంగా మారుతోంది.

పెరిగిన ధరలతో సతమతమవుతున్న శ్రీలంక పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.

పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ప్రభుత్వ ఆధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటర్ పెట్రోల్ ధరను దాదాపు శ్రీలంక కరెన్సీలో 84 రూపాయల మేర పెంచింది.

★ దీంతో 92 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర ఎల్కేఆర్ 338కి, 95 ఆక్టేన్ పెట్రోల్ లీటర్ ధర రూ. 95 మేర పెరిగి రూ. 373కు చేరింది.

★ సూపర్ డీజిల్ లీటర్ ధర రూ.75 పెరిగి రూ.329కి చేరుకోగా.. ఆటో డీజిల్ లీటర్ ధర రూ.113 పెరిగి రూ. 289కి చేరింది.