శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా…

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రం తనకు అందినట్లు పార్లమెంట్‌ స్పీకర్‌ కూడా ధ్రువీకరించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో అధ్యక్షుడు రాజపక్స దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల 13న తను అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతానని చెప్పారు. ఆ తర్వాత తనను దేశం దాటనిస్తేనే రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టారు. ఇవాళ సురక్షితంగా సింగపూర్‌కు చేరిన తర్వాతే రాజపక్స రాజీనామా చేసినట్లు సమాచారం.