శ్రీలంక అదుపులో 22 మంది తమిళజాలర్లు..

శ్రీలంక అదుపులో 22 మంది తమిళజాలర్లు..

తమిళనాడుకు చెందిన 22 మంది జాలర్లను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. సరిహద్దు దాటి చేపల వేట సాగించారనే కారణంగా నేదుండివు సమీపంలో వారిని అదుపులోకి తీసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను తరచూ శ్రీలంక అరెస్ట్ చేస్తోంది. భారీగా తమిళ జాలర్లను కస్టడీలోకి తీసుకుని, జైళ్లకు తరలిస్తోంది. శ్రీలంక నేవీ తీరుపై విమర్శలొస్తున్నాయి. మత్స్యకారుల విడుదలకు కేంద్రం చొరవచూపాలని తమిళులు కోరుతున్నారు.