శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్…

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. బెంగ‌ళూరు వేదిక‌గా శ్రీలంక తో జ‌రిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ విజ‌యంతో శ్రీలంక త‌మ సెమీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అయితే.. ఇంగ్లాండ్ సెమీస్ అవ‌కాశాలు దాదాపుగా గ‌ల్లంతు అయ్యాయి. ఇంగ్లాండ్ నిర్దేశించిన 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం! గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్‌ బృందాన్ని..గురువారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక మట్టికరిపించింది. వరల్డ్‌కప్‌లో ఇం‍గ్లండ్‌పై ఆధిపత్యం కొనసాగిస్తూ ఐదో విజయం నమోదు చేసింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో లంక పేసర్లు లాహిరు కుమార, కసున రజిత, ఏంజెలో మాథ్యూస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక స్కోర్లు:
►టాస్‌- ఇంగ్లండ్‌- బ్యాటింగ్‌
►ఇంగ్లంగ్‌ స్కోరు: 156 (33.2)
►శ్రీలంక స్కోరు: 160/2 (25.4)
►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: లాహిరు కుమార(మూడు వికెట్లు)
►టాప్‌ స్కోరర్‌: పాతుమ్‌ నిసాంక(77- నాటౌట్‌)..

ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌(28)తో పాటు మొయిన్‌ అలీ వికెట్‌ను ఏంజెలో మాథ్యూస్‌ పడగొట్టగా.. బెన్‌ స్టోక్స్(43), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(8), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(1) రూపంలో కుమార మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు..
కసున్‌ రజిత.. మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(30)తో పాటు క్రిస్‌ వోక్స్‌(0)ను అవుట్‌ చేశాడు. స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ మార్క్‌ వుడ్‌ను పెవిలియన్‌కు పంపి తానూ ఓ వికెట్‌ తీశాడు. ఈ క్రమంలో 33.2 ఓవర్లలో 156 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది.