శ్రీలంక లొ ప్రస్తుత పరిస్తితి దారుణం….. ఎందుకు ఇలా అయ్యింది.. ముందు జాగ్రత్త చర్యలు లేకపోతె ఎవ్వరికైనా ఇదే తిప్పలు.. !!!!.

ప్రభుత్వ సూపర్‌మార్కెట్లలో సరకులు దొరకడం లేదు.

కొన్నిచోట్ల పూర్తిగా ఖాళీ అయిపోయాయి…

పాల పొడి, బియ్యం వంటి దిగుమతి చేసుకునే ఇతర ఆహార వస్తువులు కూడా ఇక్కడ పరిమితంగానే దొరుకుతున్నాయి….నిత్యవసర వస్తువుల సరఫరాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటాబాయ రాజపక్స ఆగస్టు 30న వెల్లడించారు.

ఆహారపు పదార్థాల అక్రమ నిల్వలు, ద్రవ్యోల్బణం కట్టడికి ఈ అత్యవసర పరిస్థితి తప్పనిసరని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

శ్రీలంక రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. మరోవైపు ధరలు, విదేశీ అప్పులు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ విదేశీ పర్యటకం కూడా భారీగా దెబ్బతింది.

ఆరోపణలు ఇలా వినిపిస్తున్నాయి.

ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత ధీన స్థితిలోకి నెట్టాయి. రాజకీయ లబ్దే ప్రధానంగా జాతీయ ప్రయోజనాలు మరుగుపడినచోట ఇలాంటి ఉత్పాతాలే మిగులుతాయి. శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టింది. పన్నులు రద్దు చేసి.. ఆదాయం లేక అప్పుల మీద అప్పులు చేసి… ఉచిత సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేసి చేతులు కాల్చుకుంది. ఫలితంగా దేశ ఆదాయం కన్నా ఖర్చులు రెట్టింపయ్యాయి..

కరోనా ఎఫెక్ట్..పర్యాటకులు లేరు..ఆదాయం లేదు.….

అప్పులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకింది. నిత్యావసర వస్తువులను సైతం దిగుమతి చేసుకోలేని స్థితికి చేరుకుంది.
2021లో శ్రీలంక ప్రభుత్వం కెమికల్ ఫర్టిలైజర్స్‌పై నిషేధం విధించి రైతాంగాన్ని బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు నెట్టడంతో దేశంలో ఆహార ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో తిండికి కూడా కొరత ఏర్పడే పరిస్థితి దాపురించింది..

బ్యాంక్ రుణాలు చెల్లించడం లేదు...

అంతర్జాతీయ ద్రవ్య నిధి, జపాన్ బ్యాంక్, సింగపూర్ బ్యాంక్‌లను ఆశ్రయిస్తుంటాయి. చౌక వడ్డీతో పాటు రుణ చెల్లింపు గడువు 30 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుంది కాబట్టి సులువుగా అప్పులు తీర్చవచ్చునని భావిస్తాయి. కానీ శ్రీలంక ప్రభుత్వం కమర్షియల్ బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకుని.. వాటిని చెల్లించలేక మరింత సంక్షోభంలో కూరుకుపోయింది….దేశ రుణ భారం కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో స్థూల జాతీయ ఆదాయం (జీఎన్ఐ)లో 39 శాతంగా ఉన్న అప్పులు.. 2019నాటికి 69 శాతానికి పెరిగాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది..

నిత్యావసర సరుకుల దిగుమతి డబ్బులు లెవు..
ఆర్థిక సంక్షోభం నడుమ కొన్ని నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

పంచదార, ఉల్లిపాయలు, పప్పుల ధరలు కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి…

నిత్యావసర వస్తువుల దిగుమతి కోసం డబ్బులు లేకపోవడంతో ధరల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు నిజంగానే ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామాలతో దేశంలో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ప్రజలు రోడ్ల పైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఏ ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి ఉచిత సంక్షేమ పథకాలపై శ్రీలంక ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేసిందో… నిజానికి నిజమైన లబ్దిదారులకు అవి దక్కలేదన్న విమర్శలున్నాయి. శ్రీలంక ప్రభుత్వ విధానాలు చివరాఖరికి ఆ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు సహాయం కోసం ధీనంగా ఎదురుచూసే స్థితిలో నిలబెట్టాయి.