మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.12కోట్ల సుపారీ డీల్..!!!

మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు ఫరూఖ్ అనే వ్యక్తితో మంత్రిని హత్య చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 12 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫరూఖ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్య కుట్ర బయటపడింది…నిందితులని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు.. అందులో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో భాగస్వామి రఘును అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో రఘును పోలీసులు అరెస్టు చేశారు. రఘుకు ఆశ్రయమిచ్చిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. హత్య కుట్రకోణాన్ని సైబరాబాద్‌ పోలీసులు ..
దిల్లీ పోలీసులకు తెలియజేశారు…మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కోణం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లింకుతో ఈ కేసుకు లింకు వున్నట్లు సమాచారం. గత సమయంలో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్‌లో అక్రమాలు వున్నాయంటూ మహబూబ్ నగర్‌కు చెందిన కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులు చేసిన వారిని కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం 12 కోట్లు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారని చెబుతున్నారు.