శ్రీరామానుజాచార్యుల విగ్రహం వివరాలు….ఎన్నో అద్భుతాలు…

R9TELUGUNEWS.COM….

ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ(PM Modi) ముచ్చింతల్‌ పర్యటన ఖరారు….

35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. ..

108 సాలగ్రామ విష్ణు మూర్తుల ఉపాలయాలు,1035 యజ్ఞ కుండికలతో మరియు 5000 ఋత్వికులతో జరిపే మహాయజ్ఞం చూడటానికి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది…

హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం వేడుకలు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. అయితే.. ఈ వేడుకల సందర్భంగా ముచ్చింతల్ లోని జీవా ప్రాంగణంలో 45 ఎకరాల విస్త్రీర్ణంలో రూపుదిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి 216 ఎత్తులో కొలువుదీరిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ సమతాస్ఫూర్తి కేంద్రం వివరాలు, విగ్రహం వివరాలు తెలుసుకుందామా..?ఈ సమతామూర్తి కేంద్రానికి 2014లోశంకుస్థాపన జరిగింది. దీని నిర్మాణం 6 ఏళ్లలో నిర్మాణం పూర్తయింది. సుమారు 12 వేల కోట్ల రూపాయలతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. భద్రవేదిపై 216 అడుగుల ఎత్తులో శ్రీరామానుజచార్యుల విగ్రహం కొలువుదీరింది. భద్రవేదిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుంది.
ఈ పద్మపీఠంలో 36 ఏనుగులు, 108 పద్మదళాలు ఉన్నాయి. 108 అడుగుల వెడల్పుతో వృత్తాకారంలో పద్మదళాలను ఏర్పాటు చేశారు..పద్మపీఠంపై ఉన్న శ్రీరామానుజచార్యుల విగ్రహం ఎత్తు 108 అడుగులు.. శ్రీరామానుజచార్యులు ఆసీనులైన పద్మపీఠం చుట్టు కొలత 108 అడుగులు..
శ్రీరామానుజచార్యుల చేతిలో త్రిదండం ఎత్తు 153 అడుగులు, బరువు 60 వేల కిలోలు..
త్రిదండంపై ఉన్న జల పవిత్రం 6 వేల కిలోలు.. భద్రవేదిపై ఉన్న సమతామూర్తి విగ్రహం దిగువన మూడంతస్తులు నిర్మించారు. 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 90 స్తంభాలతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించారు…90 స్తంభాలపై రామానుజచార్యుల జీవిత చరిత్రను తెలిపే చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆగ్మెంటెడ్ రియాల్టీతో స్తంభాలపై రామానుజచార్యుల చిత్ర కళాప్రదర్శనకు ఆస్కారం ఉంది. భద్రవేది మొదటి అంతస్తులో రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహం ఉంటుంది. ప్రసన్న శరణాగత మండపంగా మొదటి అంతస్తుకు పేరు పెట్టారు. రామానుజులు 120 సంవత్సరాలు జీవించారని గుర్తుగా 120 కిలోల బంగారంతో సువర్ణమయ మూర్తిని తయారు చేయించారు. 36 అంగుళాల ఎత్తైన పీఠంపై 54 అంగుళాల ఎత్తులో బంగారు విగ్రహం ప్రతిష్ఠాపన చేశారు.