శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద ఉధృతి.

*కర్నూలు జిల్లా (శ్రీశైలం)*

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి..

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి  పెరిగింది.

★ ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3 లక్షల 67 వేల 698 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12 వేల 714 క్యూసెక్కులుగా ఉంది.

★ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 848.30 అడుగులకు చేరింది.

★ అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 76.3162 టీఎంసీలుగా కొనసాగుతోంది.

★ శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.