శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం : ఈఓ కెఎస్ రామారావు..

కర్నూలు : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం : ఈఓ కెఎస్ రామారావు..

మార్చి 4 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 14 న ఉత్సవాలు ముగుస్తాయి : ఈఓ కెఎస్ రామారావు

నల్లమల అడవుల నుంచి భక్తుల పాదయాత్రకు అనుమతి ఉంది ఇప్పటికే భక్తులు పాదయాత్రతో శ్రీశైలం వస్తున్నారు : ఈఓ కెఎస్ రామారావు

కొన్ని సోషల్ మీడియాలో శ్రీశైలానికి అడవుల నుంచి పాదయాత్ర అణుమతి లేదు అని ప్రచారం జరుగుతుంది అటువంటి వదంతులు నమ్మవద్దు : ఈఓ కెఎస్ రామారావు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కోవిడ్ నిబంధనల కారణంగా స్వామివారి స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేశాం దూర దర్శనం కొనసాగుతుంది : ఈఓ కెఎస్ రామారావు

శ్రీశైలంలోని పాతాళగంగ పుణ్య స్నానాలు కోవిడ్ కారణంగా రద్దు చేశాం : ఈఓ కెఎస్ రామారావు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం : ఈఓ కెఎస్ రామారావు…