శ్రీశైలంలో 26 నుంచి కార్తీక మాసోత్సవాలు: ఈవో..

శ్రీశైలంలో ఈ నెల 26 నుంచి నవంబర్ 23 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగుతాయని ఈవో లవన్న తెలిపారు. నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం మూసివేస్తామని చెప్పారు. కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో స్పర్శదర్శనం రద్దు చేస్తామని ఈవో లవన్న పేర్కొన్నారు. శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల సేవా టికెట్ల ధరలను పెంచలేదని ఈవో వెల్లడించారు.