24 నుంచి శ్రీశైలంలో స్వామివారి స్పర్శదర్శనం..

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కలుగనుంది. ఈసారి ఉగాది ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వారం రోజుల ముందే భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో స్పర్శ దర్శనం కారణంగా స్వామివారి దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ ఈవో లవన్న తెలిపారు..