మల్లన్న దర్శనానికి గవర్నర్ తమిళిసై , మంత్రి హరీశ్‌రావు.

నేడు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న గవర్నర్ తమిళిసై , మంత్రి హరీశ్‌రావు.

నేడు పలువురు ప్రముఖులు శ్రీశైలం రానున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు శ్రీశైలం చేరుకున్నారు. మరికాసేపట్లో స్వామి వారిని మంత్రి దర్శించుకోనున్నారు. అలాగే నేడు శ్రీశైలానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా రానున్నారు. జస్టిస్ మిశ్రా సాయంత్రం శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు. కాగా ఈ సాయంత్రం తెలంగాణ గవర్నర్ తమిళిసై మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఆలయ అధికారులు ప్రముఖుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు