శ్రీశైలం ప్రాజెక్టుకు 2.61 లక్షల‌ క్యూసెక్కుల వరద…

ఎగువనుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుకున్నది. జూరాల నుంచి 1,45,940 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,15,792 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2,61,732 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి‌మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 836.40 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు. ఇప్పుడు 56.78 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నది..