శ్రీశైలం నీటి వినియోగం పై ఏపీ, తెలంగాణ వాదన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది..తెలంగాణ తోడేసిందని ఏపీ ఆరోపించింది. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు 2.4 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కేఆర్‌‌ఎంబీని తెలంగాణ కోరింది. సాగర్‌‌ నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేసుకుంటామని, ఆ నీటిని ఏపీ తరలించకుండా కట్టడి చేయాలని కోరింది. కాగా, శ్రీశైలం నుంచి ప్రస్తుతం తమకు నీళ్లు అవసరం లేదని, సాగర్‌‌ నుంచి 30 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ కోరింది. సాగర్‌‌ నుంచి ఇప్పటికే కోటాకు మించి నీటిని ఏపీ వాడుకుందని తెలంగాణ అభ్యంతరం చెప్పింది. రాష్ట్ర వాటాగా రావాలసిన 65 టీఎంసీలను రిలీజ్ చేయాలని తెలంగాణ కోరింది. దీనిపై తర్వాత జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ తరఫున కర్నూల్‌ సీఈ మురళీనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు..