శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు అద్దె గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం నిలిపివేత…ఈవో

R9TELUGUNEWS.COM ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో అద్దె గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవానకో పేర్కొన్నారు. కుటీర నిర్మాణ పథకం కింద వసతిగదులు నిర్మించిన దాతలకు మాత్రం ముందస్తు రిజర్వేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10లోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఆ తర్వాత వచ్చే లేఖలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.